కారేపల్లి, నవంబర్ 13 : కారేపల్లి మండలం గాదెపాడు ప్రాధమికొన్నత పాఠశాల విద్యార్ధులకు దాతల సహకారంతో టీషర్టు, ప్యాంట్లు, ఐడీ కార్డులను గురువారం అందజేశారు. టీఎస్‌యూటీఎఫ్ నేత బానోత్ మంగీలాల్ మిత్రబృందం మను, తఅప్తేష్ షా, జయసుధ ఆర్ధిక సాయంతో విద్యార్ధులకు డ్రెస్‌లను కాంప్లెక్స్ హెచ్ఎం శారద చేతుల మీదిగా అందజేశారు. ఇటివలే వీరు పాఠశాలకు మైక్, విద్యార్ధులకు స్కూల్ బ్యాగులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ దుగ్గిరాల జయరాజు, యూటీఎఫ్ మండల అధ్యక్షుడు కేవీ.కృష్ణారావు, ఎటుకూరి నాగేశ్వరరావు, గ్రామ పెద్దలు వేముల రాముర్తి, కేలోత్ సూర్యకుమార్, గడిపర్తి వీరభద్రరావు, భూక్యా రంజిత్ కుమార్, ఉపాధ్యాయులు బి.బిక్కు, జి.కిషన్, మురళి, కృష్ణవేణి, సీఆర్పీ పరమేశ్, అంగన్వాడీ టీచర్ రాణెమ్మ పాల్గొన్నారు.