కారేపల్లి, నవంబర్ 15 : కారేపల్లి మండలం పోలంపల్లి నాగయ్యగుంపునకు చెందిన పొడుగు శేషగిరి కుటుంబానికి ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన రూ.2 లక్షల చెక్‌ను తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ తోటకూరి రాము శనివారం అందజేశారు. పొడుగు శేషగిరి టీజీబీలో రూ.436తో పీఎంజేజేబీవై పాలసీ తీసుకుని మృతిచెందగా కుటుంబానికి బీమా సొమ్ము రూ.2 లక్షలు చెల్లించారు. ఈ సందర్బంగా మేనేజర్ రాము మాట్లాడుతూ బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు తప్పని సరిగా ప్రమాద బీమా, సాధారణ బీమా చేయించుకోవాలని సూచించారు. అలాగే పంట రుణాలు తీసుకున్న రైతులు తప్పని సరిగా పంట రుణాలు రెన్యూవల్ చేసుకోవాలన్నారు. రెన్యూవల్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వం నుండి 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుందని తెలిపారు.