అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ( Assebly Meeting ) కొనసాగుతున్నాయి. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( Chandra Babu ) మాట్లాడారు. సోషల్ మీడియా వల్ల పిల్లలు నష్టపోవద్దనే సంకల్పానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్నారు.
స్వప్రయోజనాల కోసం సాంకేతికతను ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని , దానికి బానిసై చెడుకు ఉపయోగిస్తే నాశనమవుతారని అన్నారు. 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని సూచన వచ్చిందని, వారికి సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చేసే కార్యక్రమానికి 90 రోజుల్లో శ్రీకారం చుడతామని, 13-16 ఏళ్ల లోపు వారికి ఏం చేయాలన్నదానిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
వైసీపీ హయాంలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ప్రజలపై భారం మోపారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా అన్ని పథకాలు కొనసాగిస్తున్నామని, వచ్చే ఏడాదికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు.