కారేపల్లి, నవంబర్ 12 : యువత డ్రగ్స్‌కు ఆకర్షితులై జీవితాలను ఆగం చేసుకోవద్దని కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నోముల విజయకుమారి అన్నారు. బుధవారం కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరోపై విద్యార్ధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. డ్రగ్స్ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పాడు చేస్తాయన్నారు. విద్యార్ధులు సమాజ మార్పునకు కారకులు కావాలే తప్పా బాధితులుగా మారవద్దన్నారు. డ్రగ్స్ ఫీ తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పోగ్రాం ఆఫీసర్లు సుధారాణి, శేషుప్రసాద్, శ్రీనివాస్, అధ్యాపకులు పాల్గొన్నారు.