కారేపల్లి, నవంబర్ 15 : కారేపల్లి మండలం మాధారంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోసైటీ పాలకవర్గం శనివారం ప్రారంభించింది. ఈ సందర్బంగా చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ద్వారా రైతుకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. మొక్కజొన్న పంట అధికంగా పండిస్తున్న మాధారం ప్రాంతంలో కొనుగోలు కేంద్రం కావాలని సోసైటీ పాలకవర్గం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్ దృష్టికి తెచ్చి ఎమ్మెల్యే సహకారంతో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సింగరేణి మండలంలో విశ్వనాధపల్లి, మాధారం, ఎర్రబోడు, సింగరేణి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు సైతం ఐకేపీ, సోసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సోసైటీ ఉపాధ్యక్షుడు దారావత్ మంగీలాల్, డైరక్టర్లు అడ్డగోడ ఐలయ్య, కొత్తూరి రామారావు, కార్యదర్శి బల్లు హనుమంతరావు, ఏఈఓ చంద్రకళ, మాజీ ఎంపీటీసీ భాగం రూపా నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ అజ్మీర నరేశ్, రైతు ప్రతినిధులు బానోత్ రాంమూర్తి , కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కిలారి అప్పారావు, రైతు నాయకులు బానోత్ రాంమ్మూర్తి, ఇమ్మడి తిరుపతిరావు, రైతులు భాగం వెంకటప్పారావు, భాగం నాగేశ్వరరావు, కాసాని లక్ష్మినారాయణ, పాపినేని నాగేశ్వరరావు, అంగోత్ మత్రు, రఘు, మంకిన్ని చిన్న సైదయ్య, పిల్లలమర్రి వీరన్న, జాటోత్ వీరన్న, కుర్ర శ్రీను, గుర్రం నర్సింహరావు, తొగరు శ్రీను పాల్గొన్నారు.