కారేపల్లి, నవంబర్ 17 : దేశం క్షేమంగా ఉన్నప్పుడే మనమంతా సంతోషంగా ఉంటామని, దేశ ప్రజలందరి యోగక్షేమాల కోసం ప్రార్థనలు చేయాలని పాస్టర్ చల్లగండ్ల రమేశ్ బాబు అన్నారు. సింగరేణి మండల పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశం గేట్ కారేపల్లి పాస్టర్ త్యాగరాజు ఆధ్వర్యంలో చర్చిలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య ప్రసంగీకులు చల్లగండ్ల రమేశ్ బాబు హాజరై బైబిల్ వాక్య బోధనలు చేశారు. అందరూ ఐకమత్యం కలిగి ఉండాలని, లేనివారికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. క్రిస్టమస్ సందర్భంగా పేదలను ఆదరించే రీతిగా తమ సేవకులు ఉండాలని, సేవ అంటేనే చాలా కష్టమైనదని, తట్టుకుని చేసిన వారే నిజమైన సేవకులన్నారు. మరికొద్ది రోజుల్లో ఖమ్మం జిల్లాలో అద్భుతమైన సమావేశం జరగబోవుచున్నది దానికి సేవకులంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా డోర్నకల్ ప్రాంతంలో ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరిగే సమావేశానికి డాక్టర్ రెవరెండ్ కొరియన్, జీవనది గ్రేస్ కొరియన్, జడ్సన్ కొరియన్ ముఖ్య ప్రసంగీకులుగా వస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీసీసీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తన్నీరు మధుసూదన్ రావు, మండల అధ్యక్షుడు ప్రేమ్ సాగర్, జాయింట్ సెక్రెటరీ విలియం కేరి, గౌరవ అధ్యక్షుడు పాల్ రాజు, గౌరవ సలహాదారు బాబురావు, కోశాధికారి మోషే, ప్రచరణ కర్త జయరాజు, ఉపేందర్, లాజరస్, రాజు, సుదర్శన్, ప్రసాద్, సామెల్, పిన్ని పాల్గొన్నారు.