ఫిబ్రవరిలో 200పైగా వాహనాల సీజ్ : శిఖాగోయెల్
గత నెలలో తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దూకుడు ప్రదర్శించింది. రాష్ట్రవ్యాప్తంగా రవాణా, జీఎస్టీ, గనులు, భూగర్భ, వాణిజ్య పన్నులు, అటవీ, పౌర సరఫరాలు, పోలీసు విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముమ్మర తనిఖీలు చేపట్టింది. సోమవారం డీజీ శిఖాగోయెల్ ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): గత నెలలో తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దూకుడు ప్రదర్శించింది. రాష్ట్రవ్యాప్తంగా రవాణా, జీఎస్టీ, గనులు, భూగర్భ, వాణిజ్య పన్నులు, అటవీ, పౌర సరఫరాలు, పోలీసు విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముమ్మర తనిఖీలు చేపట్టింది. సోమవారం డీజీ శిఖాగోయెల్ ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరిలో వెయ్యి కంటే ఎకువ వాహనాలను తనిఖీ చేసి, నిబంధనల ఉల్లంఘించిన 200 కంటే ఎకువ వాహనాలను సీజ్ చేసినట్టు తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాలపై జరిపిన దాడుల్లో 24 వాహనాలను సీజ్ చేసి, 245 మెట్రిక్ టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకోవడంతోపాటు 19 మందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు.
131 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 27 క్వింటాళ్ల గోధుమలను పట్టుకున్నట్టు వెల్లడించారు. సంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని సంక్షేమ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించి, అకడి లోపాలను గుర్తించినట్టు వివరించారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన చర్యల కోసం సంబంధిత శాఖలకు నివేదించనున్నట్టు తెలిపారు. తనిఖీల్లో సుమారు రూ.10.79 కోట్ల మేర ఆదాయ నష్టాన్ని గుర్తించామని, ఇందులో రూ.1.96 కోట్లు వసూలు చేశామని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ నిధులు, వనరుల దుర్వినియోగం గురించి సమాచారం ఉంటే తక్షణమే టోల్ ఫ్రీ నంబర్ 14432కు కాల్ చేయాలని శిఖాగోయెల్ కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

