కారేపల్లి, నవంబర్ 17 : కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ వ్యాప్తంగా సింగరేణి (కారేపల్లి), ఏన్కూర్, జూలూరుపాడు, వైరా, కొణిజర్ల మండలాల్లో గల ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు, దేవాలయాల కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో స్వామి వారికి మహన్యాస రుద్రాభిషేకం, అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారికి అన్న పూజ అలంకరణలో అమర్నాథ్ లింగ అలంకరణ చేయడం జరిగింది. కారేపల్లి మండల పరిధిలోని లింగం బంజరలో గల పురాతన శివాలయంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు. అనంతరం ఆకాశదీపాన్ని ధ్వజ స్తంభం పైకి ఎత్తి వెలిగించారు.

Karepally : ఘనంగా కార్తీక చివరి సోమవారం ప్రత్యేక పూజలు