కారేపల్లి, నవంబర్ 15 : ప్రేమ పేరుతో యువతిని మోసగించి ఆమె ఆత్మహత్యకు కారకుడైన నిందితుడు నామ నరేశ్‌ను కఠినంగా శిక్షించాలని పీఓడబ్ల్యూ ఖమ్మం జిల్లా కార్యదర్శి వై.జానకి డిమాండ్ చేశారు. శనివారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. రేలకాయలపల్లికి చెందిన జర్పల సందీప్తిని ప్రేమ పేరుతో వంచించడమే కాక సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టి బ్లాక్ మెయిల్‌కు పాల్పడడంతో పురువు పోయిందని తీవ్ర ఆవేదనతో యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. యువతి ఆత్మహత్యకు కారకుడైన నరేశ్‌ను ఆరెస్ట్ చేసి, మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరారు.