Axar Patel | అక్షర్ అద్భుతః.. బౌండరీ వద్ద కళ్లు చెదిరే క్యాచ్.. వీడియో..!
Axar Patel : పొట్టి ప్రపంచకప్ కీలక మ్యాచ్‌లో భారత వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ (Axar Patel) మైదానంలో అద్భుతం చేశాడు. సెమీఫైనల్లో టామ్ బ్యాంటన్ను క్లీన్‌బౌల్డ్ చేసిన అక్షర్.. కళ్లు చెదిరే క్యాచ్‌తో బిగ్ వికెట్ అందించాడు.
Axar Patel : పొట్టి ప్రపంచకప్ కీలక మ్యాచ్‌లో భారత వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్(Axar Patel) మైదానంలో అద్భుతం చేశాడు. సెమీఫైనల్లో టామ్ బ్యాంటన్ను క్లీన్‌బౌల్డ్ చేసిన అక్షర్.. కళ్లు చెదిరే క్యాచ్‌తో బిగ్ వికెట్ అందించాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 14వ ఓవర్ చివరి బంతికి విల్ జాక్స్(35) పెద్ద షాట్ ఆడగా.. పరుగెడుతూ వెళ్లిన అక్షర్ పటేల్ బంతిని అందుకున్నాడు. బ్యాలెన్స్ తప్పి బౌండరీ లైన్‌కు తాకుతున్నట్టు గమనించిన అతడు.. అప్రమత్తమై బంతిని శివం దూబే వైపు విసిరాడు. దూబే కూల్‌గా బంతిని అందుకోవడంతో డేంజరస్ జాక్స్ ఔటయ్యాడు. అంతే.. భారత డగౌట్, స్టేడియంలోని అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు.
భారత్ నిర్దేశించిన 254 పరుగుల ఛేదనలో 95కే ఇంగ్లండ్ నాలుగు వికెట్లు పడ్డాయి. ఆ దశలోప్రత్యర్థిని టీమిండియా చిత్తు చేయడం ఖాయమనుకున్నారంతా. కానీ, జాకబ్ బెథెల్(105)కు తోడుగా.. విల్ జాక్స్(35) చెలరేగాడు. దాంతో.. ఇంగ్లండ్ లక్ష్యానికి చేరువ కాసాగింది. ఆ సమయంలో 14వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్. మూడు వైడ్లతో ఆందోళన కలిగించాడు. కానీ, జాక్స్‌ను ఊరిస్తూ అతడు వేసిన చివరి బంతిని అక్షర్ పటేల్ బౌండరీ వద్ద కళ్లు చెదిరే విధంగా క్యాచ్ అందుకున్నాడు.
We’re witnessing an Axar Patel masterclass in the field! 🫡
Another 𝗯𝗹𝗶𝗻𝗱𝗲𝗿 𝗼𝗳 𝗮 𝗴𝗿𝗮𝗯 to break the partnership 👏
Wicket No. 5️⃣
Updates ▶️ https://t.co/LxSBs3EDPx#TeamIndia | #T20WorldCup | #MenInBlue | #ENGvIND pic.twitter.com/OjR805VIlk
— BCCI (@BCCI) March 5, 2026
బౌండరీని తాకేలోపే.. బంతిని దూబే చేతికి అందించి.. జాక్స్ వికెట్ తీయడంలో కీలమయ్యాడు. అతడు అప్పటివరకూ బెథెల్‌తో కలిసి బౌండరీల మోతతో ఇంగ్లండ్ స్కోరు బోర్డును ఉరికించిన జాక్స్ ఔటవ్వడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. చివరి ఓవర్లో 30 పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతికే బెథెల్ రనౌట్ కావడంతో ఇంగ్లండ్ ఓటమి ఖాయమైంది. చివరి మూడు బంతుల్లో ఆర్చర్ సిక్సర్లు రాబట్టినా.. 7 పరుగులతో గెలుపొందిన సూర్యకుమార్ సేన ఫైనల్లో అడుగుపెట్టింది.
WE ARE INTO THE FINAL 🥳#TeamIndia win by 7⃣ runs in Mumbai 🙌
Scorecard ▶️ https://t.co/LxSBs3EDPx#T20WorldCup | #MenInBlue | #ENGvIND pic.twitter.com/C6Yh6ZTd7d
— BCCI (@BCCI) March 5, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

