కారేపల్లి, నవంబర్ 17 : ఎన్నికల్లో గట్టెక్కడానికి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పాలకులు విఫలమయ్యారని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, కొండబోయిన నాగేశ్వరరావు అన్నారు. సోమవారం కారేపల్లి మండల కమిటీ సమావేశం ఇస్మాయిల్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో తాళ్లపల్లి కృష్ణ మాట్లాడుతూ.. ఎన్నికల హామీలు అమలుకు నోచుకోలేదని, కొన్ని హామీలు పాక్షికంగా అమలు చేసి పూర్తి అమలు చేసినట్లు ప్రకటించుకుంటున్నట్లు దుయ్యబట్టారు. రైతు రుణమాఫీ మధ్యలోనే ఆగిందని, రబీ సీజన్ బోనస్ వేయలేదని, రైతు భరోసాను ప్రభుత్వం భారంగా భావిస్తుందన్నారు. తుఫాన్‌తో చేతికి వచ్చిన పంటలు తుడిచి పెట్టుకపోయాయని, పత్తి రైతు దిక్కుతోచని స్ధితిలో ఉన్నాడన్నారు. పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టక పోవడం విచారకమన్నారు. కేంద్రలోని మోదీ ప్రభుత్వం ప్రజలను మతం మత్తులో ఉంచి ఉద్రిక్తలతో అధికారం కాపాడుకుంటుందన్నారు. ఉద్రిక్తల మధ్య బీజేపీ తన కార్పొరేట్ శక్తులకు ప్రజల ఆస్తులను కట్టపెడుతుందన్నారు.
దేశంలో ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని, ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వ కీలుబమ్మగా మారిందని విమర్శించారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఎన్నికలు బ్యాలెట్ ద్వారా నడుస్తుండగా భారతదేశంలో ఆనేక ఆరోపణలు వస్తున్నా ఈవీఎంలతోనే నిర్వహిస్తుండడం శోచనీయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేసి పోరాటాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, మండల కార్యదర్శి కె.నరేంద్ర, నాయకులు వజ్జా రామారావు, రేగళ్ల మంగయ్య, కె.ఉమావతి, అజ్మీర శోభన్‌బాబు, కేసగాని ఉపేందర్, పండగ కొండయ్య, లక్ష్మణ్, తేజావత్ చందర్, కొండల్రావు, కరపటి సీతారాములు, రవికుమార్ పాల్గొన్నారు.