మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. వారి సంక్షేమం కోసం రొయ్య పిల్లలు, చేప పిల్లల పంపిణీ పథకాన్ని అమలు చేస్తోందని గుర్తుచేశారు.
భద్రాద్రి జిల్లాలో ఈసారి విస్తారంగా పత్తి సాగైంది. ఇప్పుడిప్పుడే పంట చేతికి వస్తున్నది. కూలీలకు ఉపాధి లభిస్తున్నది. మరోవైపు క్వింటా పత్తికి ధర రూ.9,500 వరకు పలుకుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బూర్గంపహాడ్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)లో ఇక నుంచి రోజలంతా నిరంతరాయంగా వైద్య సేవలు అందుతాయని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తెలిపారు. ఈ సెంటర్ను ఆయన శుక్రవారం సందర్శించారు.
క్రీడల్లో గెలుపోటములు సహజమని కేయూ వీసీ తాటికొండ రమేశ్ అన్నారు. రెండు రోజులపాటు కేయూలో నిర్వహించిన ఇంటర్ కాలేజియేట్ అథ్లెటిక్ మీట్ - 2022 గురువారం ముగిసింది.
సత్తుపల్లి పట్టణంలోని జేవీఆర్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించనున్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి అభినందన సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్స