ఖమ్మం కల్చరల్/ కల్లూరు/ ఇల్లెందు/ రఘునాథపాలెం, నవంబర్ 13: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆదివారం కార్తీకమాస వన సమారాధనలు వేడుకలా జరిగాయి. వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకూ పెద్దపీట వేసిన తెలంగాణ ప్రభుత్వం.. వారి సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని గుర్తుచేశారు. అన్ని సంఘాల కోసం ఆత్మ గౌరవ భవనాలు నిర్మిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని వివరించారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు.
కల్లూరులో సోమలింగారెడ్డి మామిడితోటలో ఏర్పాటు చేసిన మున్నూరు కాపు వనభోజనాల కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు గడల శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఇల్లెందులో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో కార్తీకమాస వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఇల్లెందు, కొత్తగూడెం ఎమ్మెల్యేలు హరిప్రియానాయక్, వనమా వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి పాల్గొన్నారు.
ఖమ్మంలోని చెరుకూరి వారి తోటలో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్తీక మాసం సందర్భంగా వాసిరెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో నగరంలోని చెరుకూరి వారి మామిడితోటలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ వాసిరెడ్డి కృష్ణారావు మాట్లాడారు.
ఖమ్మంలో ఖమ్మం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. బార్ అసోసియక్షసన్ అధ్యక్షుడు గొల్లపూడి రామారావు ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయమూర్తులను సత్కరించారు.
ఖమ్మం బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో ఖమ్మం ఎస్‌ఎన్‌మూర్తి తోటలో నిర్వహించిన కార్తీక వన సమారాధనకు మంత్రి అజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.