పెద్దతండాలో సహకార శాఖ పెట్రోల్ బంకు ప్రారంభంలో మంత్రి అజయ్
ఖమ్మం రూరల్, నవంబర్ 14: తెలంగాణలో సహకార రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. సహకార శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ మండలం పెద్దతండా సమీపంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంకు సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని అన్నారు. పంటల సాగు కోసం ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతులకు అందించిన ఆదుకుంటున్న రాష్ట్రం తెలంగాణ తప్ప దేశంలో మరే రాష్ట్రమూ లేదని స్పష్టం చేశారు.
పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘంలోని ప్రతి రైతుకు ఉపయోగపడేలా సేవలందించాలని కోరారు. మార్క్‌ఫెడ్ చైర్మన్ గంగారెడ్డి, వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, కలెక్టర్ పీవీ గౌతమ్, అదనపు కలెక్టర్ మధుసూదన్, సుడా చైర్మన్ విజయ్‌కుమార్, వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ చంద్రావతి, ఖమ్మం ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఆత్మ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, జడ్పీటీసీ వరప్రసాద్, ఎంపీపీ ఉమ, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేణుగోపాల్ పాల్గొన్నారు.