రఘునాథపాలెం, నవంబర్ 14: ప్రజల అవసరాలకు అనుగుణంగా వారి సౌలభ్యం కోసమే రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాలను చేపట్టిందని హరితహారం ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్ పేర్కొన్నారు. ఖమ్మంలోని వైరారోడ్డులో వీ వెంకటాయపాలెం వద్ద చేపడుతున్న నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పూర్తి కావచ్చిన భవన నిర్మాణ పనుల గురించి మంత్రి వివరించారు. అనంతరం ప్రియాంకా వర్గీస్ కూడా కలెక్టరేట్ సముదాయాల ప్లాన్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. గ్రీనరీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్‌తో వైభవంగా ప్రారంభించుకునేలా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వీపీ గౌతమ్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, అధికారులు పాల్గొన్నారు.