ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్రప్రభుత్వం ఆరోగ్య భద్రత కల్పిస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో సోమవారం ‘గ్రాండ్ హెల్త్ చాలెంజ్’ వైద్యశిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రతిఒక్కరి హెల్త్ ప్రొఫైల్‌ను హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ప్రధాన ఆసుపత్రిలో నిక్షిప్తం చేస్తామన్నారు. ఉద్యోగులు అత్యవసర సమయంలో మమత ఆసుపత్రిలో ఉచిత వైద్యం పొందేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు.
రఘునాథపాలెం, నవంబర్ 13: ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య భద్రత రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యతగా తీసుకుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ కోసం సంస్థ యాజమాన్యం ‘గ్రాండ్ హెల్త్ చాలెంజ్’ పేరిట హెల్త్ క్యాంపు చేపట్టిందని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తోందని వివరించారు. ఖమ్మం బస్టాండ్‌లో ఆదివారం నిర్వహించిన టీఎస్ఆర్టీసీ గ్రాండ్ హెల్త్ చాలెంజ్‌ను మంత్రి ప్రారంభించి ప్రసంగించారు. సంస్థలో పలు విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 50 వేల మంది ఉద్యోగులకు రోగ నిర్ధారణ పరీక్షలు చేసి హెల్త్ ప్రొఫైల్ రూపొందించనున్నట్లు చెప్పారు. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ ఆర్థికంగా పురోగతి సాధిస్తుందని చెప్పారు.
ఖమ్మం రీజియన్‌లో దాదాపు రూ.70 కోట్లుగా ఉన్న నష్టాన్ని ఇప్పుడు రూ.10 కోట్లకు తగ్గించుకున్నామన్నారు. ప్రస్తుతం ఖమ్మం డిపో లాభాల్లోకి రావడం గర్వకారణమన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ విషయం సీఎం కేసీఆర్ దృష్టిలో ఉందని, త్వరలోనే శుభవార్త వస్తుందని అన్నారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, ఈడీ వెంకటేశ్వరరావు, ఆర్ఎం ప్రభులత, డీవీఎం భవానీ ప్రసాద్, వైద్యులు గిరిసింహారావు, శైలజ, శ్రీనివాసరావు, డీఎం శంకర్రావు, పర్సనల్ ఆఫీసర్ విలాసరెడ్డి పాల్గొన్నారు.
లక్ష్మీదేవిపల్లి/ సత్తుపల్లి, నవంబర్ 13: లక్ష్మీదేవిపల్లి మండలంలోని రామచంద్ర డిగ్రీ కళాశాలలో 1974-77 బ్యాచ్ బీఎస్సీ (బీజెడ్సీ) విద్యార్థులు సుమారు 45 ఏళ్ల తరువాత ఆదివారం పూర్వవిద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్నారు. సత్తుపల్లిలోని జలగం వెంగళరావు డిగ్రీ కళాశాల 4వ బ్యాచ్ 1979-82 డిగ్రీ విద్యార్థులు కూడా 40 ఏళ్ల తర్వాత ఆదివారం జేవీఆర్ డిగ్రీ కళాశాలలో ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు.