Tomato | రాయపోల్, మార్చి 01 : ఊహించని విధంగా టమాట ధరలు పడిపోవడంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. మొన్నటివరకూ బాగా పలికిన టమాట ధర ఇప్పుడు అమాంతం పడిపోవడంతో పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం చేనులో టమాట తెంపినందుకు కూలీలకు చెల్లించాల్సిన డబ్బులు, రవాణా ఖర్చులు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ మాత్రం గిట్టుబాటు కాకపోవడంతో టమాట తెంపకుండానే చేనులోనే వదిలేస్తున్నారు.
సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలో నీటి వసతి అంతంత మాత్రమే ఉన్న చోట రైతులు కూరగాయల సాగుపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఇందులో అధిక మొత్తంలో టమాట సాగు చేశారు. అయితే ఒక్కసారిగా టమాట ధర పడిపోవడంతో పెట్టుబడులు రాని పరిస్థితి నెలకొన్నదని రైతులు వాపోతున్నారు. కనీసం కూలీలు, పంట తరలించే రవాణా చార్జీలు
కూడా గిట్టుబాటు కాకపోవడంతో చేనులోనే వదిలేస్తున్నామని తెలిపారు. 20 రోజుల క్రితం మార్కెట్లో కిలో రూ.30 ధర పలుకగా పండించిన రైతుకు రూ.20 వచ్చేది. కానీ ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.5 నుంచి రూ.10 మధ్య ధర పలుకడంతో హోల్సేల్ కిలో రూ.2 కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాయపోల్ మండలంలొని తిమ్మక్కపల్లి గ్రామానికి చెందిన ఎకరం టమాట పంట సాగు చేశాడు. అయితే పంట సాగు చేసి చేతికి వచ్ఛిన హయాంలో ధర పడిపోవడంతోపాటు అకాల వర్షానికి పంట నష్టం జరగడంతో ప్రకాశ్ బోరున విలపించారు. టమాట పంటను మండలంలోని వివిధ గ్రామాల్లో సుమారు వంద ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు. టమాట పంటకు నీరు లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

Supritha | అమ్మ సంతోషమే ముఖ్యం .. సురేఖ వాణి రెండో పెళ్లిపై సుప్రీత భావోద్వేగ వ్యాఖ్యలు
Iran vs US | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. దేశం నుంచి 444 విదేశీ విమానాలు రద్దు
Kara release Announcement | ధనుష్ ‘కారా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సమ్మర్ బరిలో దిగుతున్న కరసామి!