WI vs IND : సెమీస్ బెర్తు పట్టేసేందుకు భారత జట్టు చావోరేవో పోరులో వెస్టిండీస్‌తో తలపడుతోంది. 72 పరుగుల తేడాతో జింబాబ్వేపై గెలిచిన టీమిండియా ఈడెన్ గార్డెన్స్‌లో విండీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. గెలిస్తేనే ముందుకు.. లేదంటే ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో.. ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయమనిపిస్తోంది. టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ కరీబియన్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
నాకౌట్ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతలో ఓడిన భారత జట్టు.. జింబాబ్వేపై గెలిచి రేసులో నిలిచింది. మరోవైపు వెస్టిండీస్ తొలి పోరులో జింబాబ్వేను 106 రన్స్ తేడాతో ఓడించినా.. సఫారీ చేతిలో చిత్తైంది. దాంతో.. ఈ మ్యాచ్ ఇరుజట్లకు కీలకం. విండీస్‌ను ఓడిస్తే చాలు గ్రూప్ ఏ నుంచి భారత్ రెండో బెర్తు పట్టేస్తుంది.
Presenting #TeamIndia‘s Playing XI for the Super 8 contest against West Indies 🙌
Updates ▶️ https://t.co/ur4pr8Bi3K#T20WorldCup | #MenInBlue | #INDvWI pic.twitter.com/ZjOouacjSa
— BCCI (@BCCI) March 1, 2026
ఒకవేళ కరీబియన్ జట్టు గెలిస్తే.. టీమిండియా ఇంటిదారి పట్టాల్సిందే. అలాకాకుండా వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే నెట్‌రన్‌రేటు కీలకమవుతుంది. జింబాబ్వేపై 102 పరగుల భారీ విజయం.. ఆపై సఫారీల చేతిలో అనూహ్యంగా 8 వికెట్ల తేడాతో ఓడిన షాయ్ హోప్ సేన ప్రస్తుత నెట్రన్ రేటు +1.791. అదే భారత జట్టు రన్‌రేటు మాత్రం మైనస్‌లో ఉంది. కాబట్టి.. కచ్చింతగా విండీస్‌ను ఓడిస్తేనే టీమిండియాకు సెమీస్ బెర్తు దక్కుతుంది.
భారత తుది జట్టు : సంజూ శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా.
వెస్టిండీస్ తుది జట్టు : షాయ్ హోప్(కెప్టెన్, వికెట్ కీపర్), రోస్టన్ ఛేజ్, షిమ్రన్ హిట్మైర్, రొవ్మన్ పావెల్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, జేసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డే, అకీల్ హొసేన్, గుడకేశ్ మోతీ, షమర్ జోసెఫ్.