SA vs ZIM : పొట్టి ప్రపంచకప్‌లో ఆధిపత్యం కొసాగిస్తున్న దక్షిణాఫ్రికా అజేయంగా సెమీస్‌కు దూసుకెళ్లింది. నాకౌట్ దశలో బలమైన భారత్, వెస్టిండీస్‌ను చిత్తు చేసిన సఫారీ టీమ్.. ఆదివారం చివరి మ్యాచ్‌లోనూ పంజా విసిరింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జింబాబ్వేను వణికిస్తూ.. 5 వికెట్లతో జయభేరి మోగించింది. స్వల్ప ఛేదనలో డెవాల్డ్ బ్రెవిస్(41) రెచ్చిపోగా.. జార్జ్ లిండే(30 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్(21 నాటౌట్)లు హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో విజయతీరాలకు చేర్చారు.
రెండేళ్ల క్రితం బార్బడోస్‌లో చేజారిన ప్రపంచకప్‌ను పట్టేసేందుకు దక్షిణాఫ్రికా ఒక్కో అడుగు బలంగా వేస్తోంది. లీగ్ దశను అజేయంగా.. అపై నాకౌట్లోనూ వరుస విజయాలతో గ్రూప్ ఏ నుంచి సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఆ జట్టు చివరి మ్యాచ్‌లోనూ గర్జించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జింబాబ్వేను ఉతికేసింది.
7 out of 7 for South Africa 🔥 🇿🇦 pic.twitter.com/z1hDDvfr7i
— ESPNcricinfo (@ESPNcricinfo) March 1, 2026
తొలుత ప్రత్యర్థిని 153కే కట్టడి చేసిన సఫారీలు.. ఆపై ధనాధన్ ఆటతో లక్ష్యాన్ని కరిగించారు. డెవాల్డ్ బ్రెవిస్(౦ తన స్టయిల్ విధ్వంసంతో విరుచుకపడి జింబాబ్వేను ఒత్తిడిలో పడేశాడు. సికిందర్ రజా(3-29) విజృంభణతో టాపార్డర్ కుప్పకూలినా.. జార్జ్ లిండే(30 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్(21 నాటౌట్)లు హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో ప్రొటీస్ విజయాన్ని పరిపూర్ణం చేశారు. దాంతో.. 5 వికెట్ల తేడాతో గెలుపొందిన మర్క్రమ్ సేన ఏడు విజయాలతో సెమీస్ సమరానికి సై అంటోంది.
ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ క్వింటన్ డికాక్(0)ను వెనక్కి పంపిన సికిందర్ రజా(3-29) వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. స్లో డెలివరీతో ఎడెన్ మర్క్రమ్(4)ను బౌల్డ్ చేసిన జింబాబ్వే సారథి.. సఫారీ హిట్టర్లను నిలువరిస్తున్నాడు. 18కే మూడు వికెట్లు పడినా.. డెవిడ్ మిల్లర్(22), డెవాల్డ్ బ్రెవిస్(41)లు దూకుడైన ఆటతో జింబాబ్వే బౌలర్లను హడలెత్తించారు.
Only Sikandar Raza got going for Zimbabwe in Delhi 🇿🇼 pic.twitter.com/T6amQUjQwI
— ESPNcricinfo (@ESPNcricinfo) March 1, 2026
మిల్లర్‌ను ముజరబని బోల్తా కొట్టించగా.. సిక్సర్లతో చెలరేగుతున్న బ్రెవిస్‌ను రజా పెవిలియన్ చేర్చాడు. దాంతో.. 101 వద్ద దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత జార్జ్ లిండే(30 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్(21 నాటౌట్)లు ఆచితూచి ఆడారు. మరో వికెట్ పడకుండా చూసుకుంటూనే.. 50 ప్లస్ భాగస్వామ్యంతో 17.5 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు.
లీగ్ ఆసాంతం.. ఆపై.. నాకౌట్ తొలి రెండు మ్యాచుల్లో శుభారంభాలు ఇచ్చిన బంగ్లాదేశ్ ఓపెనర్లు దక్షిణాఫ్రికాపై మాత్రం తేలిపోయారు. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్(15), మరుమని(7)లు విఫలమవ్వడంతో జట్టును ఆదుకునే బాధ్యత తీసుకున్నాడు కెప్టెన్ సికిందర్ రజా74). సఫారీ పేస్, స్పిన్ దళాన్నిదీటుగా ఎదుర్కొన్న అతడు.. జట్టు స్కోర్ 120 దాటించి వెనుదిరిగాడు. ఆఖర్లో మెరుపులతో జింబాబ్వే ప్రత్యర్ధి ముందు 154 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.