ఉమ్మడి జిల్లాలో సోమవారం బాలల దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాలల్లో సందడి నెలకొన్నది.. విద్యార్థులు స్వాతంత్య్ర సమరయోధులు, గాంధీ, నెహ్రూ, చంద్రబోస్ వేషధారణలతో పాటు తెలంగాణ తల్లి, భరతమాత వేషధారణలతో అలంరించారు.. పలు పాఠశాలల్లో విద్యార్థులే ఉపాధ్యాయుల అవతారమెత్తి పాఠాలు బోధించారు.. వివిధ పోటీల్లో గెలిచిన విద్యార్థులకు ముఖ్యఅతిథులు, ప్రధానోపాధ్యాయులు బహుమతులు అందజేశారు.
– నమస్తే నెట్వర్క్