భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను కామారెడ్డి జిల్లా సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశించారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి చెందిన వడ్లమూడి హరికృష్ణ (49)అనే యువకుడు అమెరికాలోని వర్జినియా రాష్ట్రంలో ఓ సరస్సులో బోటింగ్ చేస్తూ గుండె పోటుతో మృతి చెందాడు.
వంతెన అసంపూర్తి పనులతో ప్రజల ఇబ్బందులు పడుతున్నారు.మండలంలోని కొల్లూరు-దోమలెడ్జి వెళ్ళే దారిలో వాగు వద్ద వంతెన పనులు నిలిచి పోయాయి. పనులు ప్రారంభించి రెండేండ్లు గడుస్తున్న పిల్లర్ దశలోనే ఉంది.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో శుక్రవారం నుంచి జల్లులతో కూడిన వర్షం ఏకధాటిగా కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినప్పటికీ అనేక చోట్ల జల్లులతో కూడిన వర్షమే పడుతోంది.
KTR | రేవంత్ రెడ్డి అపరిచితుడు సినిమాలో రాము, రెమో లాగా ప్రవర్తిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ ప్రభుత్వ అరాచకాలు, దారుణాల నుంచి తెలంగాణ ప్రజలను రక్షించేది ఒక్క కేసీఆర్ నాయకత్వమే అని తెలిపారు.
కామారెడ్డి జిల్లా లింగంపేటలో నిర్వహించిన ఆత్మ గౌరవ గర్జన కార్యక్రమంలో భాగంగా ఎక్కడైతే సాయిలును పోలీసులు అవమానించారో.. అదే అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను సత్కరించారు.
తాడ్వాయి మండలం దేమే కలాన్లో మరో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. రెండురోజుల క్రితం గ్రామంలో 24 గంటల వ్యవధిలో డయేరియాతో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం రాత్రి గ్రామానికి చెందిన నాన్మీన్
డయేరియాతో ఇద్దరు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమె గ్రామంలో చోటుచేసుకున్నది. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. మూడు రోజులుగా గ్రామస్థులు వాంతులు, విరేచనా�
అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత నాయకుడు, మాజీ ఎంపీపీ ముదాం సాయిలుపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా కామారెడ్డి జిల్లా లింగంపేటలో జూలై 25వ తేదీన ఆత్మగౌరవ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి బీఆర�
Harish Rao | ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామంలో ఊరు ఊరంతా డయేరియా బారిన పడి ఒ
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డు లోని మార్కండేయ దేవాలయంలో శనివారం వేదపండితులు గంగవరం ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో (108)అష్టోత్తర-శత-కలశపూజ-అభిషేకము-యజ్ఞము-పూర్ణాహుతి-తీర్థ-ప్రసాద తదితర కార్యక్రమ�
ఈశాన్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న రుతుపవన ద్రోణి, నైరుతి ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో వాయుగుండం కారణంగా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బీఆర్ఎస్ నాయకుల పై పెట్టే కుట్ర కేసులను అడ్డుకుంటామని, అక్రమ కేసులు బనాయిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని బీఆర్ఎస్ లీగల్ సెల్ నిజామాబాద్ జిల్లా కన్వీనర్ దాదన్నగారి మధుసూదన్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులను హె
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్తండా అటవీ ప్రాంతంలో పులి (Tiger) సంచారం కలకలం సృష్టించింది. అటవీ ప్రాంతంలో ఆవులపై దాడిచేసింది. గుర్తించిన తండావాసులు అటవీ అధికారులకు సమాచారం అందించారు.