Blood donation camp | పెద్ద కొడప్ గల్, జనవరి 8 : పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం పక్కన పాత గ్రామ పంచాయతీ ఆవరణలో గురువారం సద్గురు నరేంద్రాచార్య మహారాజ్ సంస్థాన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులు, గ్రామ ప్రజలు రక్తదానం చేసేందుకు భారీగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థాన్ సభ్యులు, నాయకులు మహేందర్ రెడ్డి, బస్వరాజు, మైనార్టీ యూత్ అధ్యక్షుడు అఫ్రోజ్, సుధాకర్ సేట్ తదితరులు పాల్గొన్నారు.