Russian Oil | నిన్న వద్దని, ఇప్పుడు కొనమంటారా.. రష్యా చమురు కొనుగోలు అంశంలో అమెరికాపై ఇరాన్ ఆగ్రహం
Russian Oil : ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి తిరిగి చమురు కొనుగోలు చేయాలని ఇండియాకు అమెరికా సూచించింది. అంతేకాదు.. రష్యా చమురు కొనాలని ఇతర దేశాల్ని కూడా అమెరికా వేడుకుంటోంది.
Russian Oil : రష్యా నుంచి చమురు కొనవద్దని ఇండియాపై అమెరికా చాలాకాలంగా ఒత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి, ఇండియా కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి తిరిగి చమురు కొనుగోలు చేయాలని ఇండియాకు అమెరికా సూచించింది. అంతేకాదు.. రష్యా చమురు కొనాలని ఇతర దేశాల్ని కూడా అమెరికా వేడుకుంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా వైఖరిపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా నుంచి ఆయిల్ కొన్న దేశాల్ని నిన్నటివరకు బెదిరించి, ఇప్పుడు అదే రష్యా చమురును కొనుగోలు చేయాలని బ్రతిమాలడం ఏంటని ఇరాన్ అంటోంది.
ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యెద్ అబ్బాస్ అరాగ్చి శనివారం అమెరికాపై విమర్శలు గుప్పించారు. ‘‘రష్యా నుంచి చమురు కొనొద్దని ఇండియాను అమెరికా కొన్ని నెలలపాటు బెదిరించింది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం ప్రారంభమైన రెండు వారాలకే తిరిగి రష్యా చమురు కొనాలని ఇండియాను, ప్రపంచాన్ని వేడుకుంటోంది. ఇరాన్‌పై అమెరికా సాగిస్తున్న అక్రమ యుద్ధానికి యురోపియన్ యూనియన్ సహకరిస్తోంది. ఇది కూడా రష్యాకు వ్యతిరేకంగానే’’ అంటూ అరాగ్చి పేర్కొన్నారు. ఇక.. ఇండియా తమ మిత్ర దేశమే అని, అందువల్ల హోర్ముజ్ జలసంధి మార్గంలో ఇండియన్ నౌకలు వెళ్లేందుకు అనుమతిస్తామని ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇండియన్ నౌకలు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతానికి మరో రెండు నౌకలు జలసంధి నుంచి బయల్దేరాయి. రెండు దేశాల మధ్య సంప్రదింపుల తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.
The U.S. spent months on bullying India into ending oil imports from Russia. After two weeks of war with Iran, White House is now begging the world—incl India—to buy Russian crude.
Europe thought backing illegal war on Iran would win U.S. support against Russia.
Pathetic. pic.twitter.com/fbkrXpXa9P
— Seyed Abbas Araghchi (@araghchi) March 13, 2026
రష్యా చమురు కొనుగోలును నిలిపివేయాలని ఇండియాను అమెరికా చాలా కాలంగా కోరింది. అలాగే ఇటీవల అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంలో భాగంగా దీనికి ఇండియా అంగీకరించిందని అమెరికా ప్రకటించింది. దీనికి తగ్గట్లే రష్యా చమురు కొనుగోలును ఇండియా తగ్గించినట్లు ప్రచారం జరిగింది. కానీ, ఈ లోపే ఇరాన్ వార్ జరగడం, హోర్ముజ్ జలసంధి నుంచి వచ్చే చమురు నౌకలు నిలిచిపోవడంతో ఇతర దేశాల నుంచి ఇండియాకు చమురు రవాణా ఆగిపోయింది. దీంతో రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోలు చేయవచ్చని అమెరికా సూచించింది. 30 రోజులపాటు అనుమతిస్తున్నామని అమెరికా పేర్కొంది. కానీ, అమెరికా ప్రకటనను ఇండియా ఖండించింది. తాము వేరే దేశం నుంచి చమురు కొనేందుకు అమెరికా అనుమతి అవసరం లేదని పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

