Collector inspection | పదో తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
Collector inspection | జిల్లా లోని పదో తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
జోగులాంబ గద్వాల : జిల్లా లోని పదో తరగతి పరీక్షలను( Exams ) ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ( Collector Rizwan Basha ) సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అభ్యాసన ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కేంద్రంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ నిర్వహించాలని, విద్యార్థులు ఇన్విజిలేటర్లు, ఇతర ఎవరూ కూడా పరీక్షా కేంద్రంలోకి సెల్ఫోన్స్ తీసుకురాకుండా కట్టుదిట్టంగా తనిఖీలు చేయాలన్నారు.
వేసవి కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, ఫ్యాన్లు వెలుతురు ఉండేలా చూడాలని అన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖ అధికారిని విజయలక్ష్మి, జిల్లా పరీక్షల సమన్వయకర్త శ్రీనివాసులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

