LPG crisis : పశ్చిమాసియా దేశం ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దేశాల యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిగుండా చమురు రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావం మన దేశంపై కూడా పడింది. ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని చెబుతున్నప్పటికీ దేవవ్యాప్తంగా గ్యాస్ కొరత స్పష్టంగా కనబడుతున్నంది. ఇదే అదనుగా భావించి పలువురు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఆహార, పౌరసరఫరాల శాఖ కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ గోదాంలలో సోదాలు నిర్వహించింది. లక్నో సిటీలో మొత్తం 1,483 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 24 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. అందులో నాలుగు ఎఫ్ఐఆర్లు గ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌లపై, మరో 20 ఎఫ్ఐఆర్లు ఇతర వ్యక్తులపై నమోదయ్యాయి. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని యూపీ ఆహార, పౌరసరఫరాల శాఖ స్పష్టంచేసింది.
‘పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో చమరు రవాణాకు ప్రధాన వనరు అయిన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దాంతో చమురు రవాణా నౌకలు నిలిచిపోయాయి. ఫలితంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిందని పుకార్లు వ్యాపించాయి. దాంతో జనం తమదగ్గర నిండు సిలిండర్లు ఉన్నా ఖాళీ సిలిండిర్లను నింపించుకోవడం కోసం బుకింగ్‌లకు ఎగబెడ్డారు. ఈ డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని పలువురు డిస్ట్రిబ్యూటర్లు గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించారు. అడిగినంత సొమ్ము చెల్లించిన వారికి బ్లాక్‌లో గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో కృత్రిమ కొరత ఏర్పడింది’ అని యూపీ పౌరసరఫరాల శాఖ తెలిపింది.