ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలో రెండో రోజు వంటగ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని తిరుపల్లి రోడ్ లో గల విమల్ గ్యాస్ ఏజెన్సీ ఎదుట వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో ( Empty cylinders) బారులు తీరారు. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో నిర్వాహకులు బుకింగ్ చేసుకున్న వారికి రశీదులు రాసుకొని ఇస్తున్నారు.
ప్రస్తుతం సిలిండర్లు అందుబాటులో లేవని స్టాక్ వచ్చిన తర్వాత తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో వెను తిరుగాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి గ్యాస్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.