Pitlam | పెద్ద కొడప్ గల్(పిట్లం), జనవరి 7: కామారెడ్డి జిల్లా పిట్లం మండల తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన రాజ్య నరేందర్ గౌడ్ బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో నూతన తహసీల్దార్‌గా మహేందర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
నూతన తహసీల్దార్ మహేందర్‌కు కార్యాలయ సిబ్బంది శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మహేందర్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానన్నారు. కార్యాలయంలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు.
పెద్ద కొడప్ గల్ తహసీల్దార్ గా భిక్షపతి..
పెద్ద కొడప్ గల్ మండల నూతన తహసీల్దారుగా భిక్షపతి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన తహసీల్దార్ అనిల్ కుమార్ బదిలీపై వెళ్లారు. కాగా నూతన తహసీల్దార్ కు కార్యాలయ సిబ్బంది శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.