లక్నో : భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలో పెండ్లి పీటలెక్కబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికతో ఈనెల 14న ముస్సోరి (ఉత్తరాఖండ్)లోని ఓ రిసార్ట్లో కుల్దీప్ వివాహం ఘనంగా జరుగనుంది.
వివాహం ముగిసిన మూడు రోజుల (17న)కు లక్నోలో రిసెప్షన్ ఏర్పాటుచేసినట్టు కుల్దీప్ కుటుంబవర్గాలు తెలిపాయి. వాస్తవానికి నిరుడు నవంబర్లోనే కుల్దీప్-వన్షికలు ఒక్కటవ్వాల్సి ఉన్నా టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అతడు తన పెండ్లిని వాయిదావేసుకున్నాడు. కాన్పూర్కే చెందిన వన్షిక.. ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తున్నది.