‘డర్టీ హరి’ తర్వాత నేను చేసిన పూర్తి భిన్నమైన పాత్ర ఇది. ఈ పాత్రలో చాలా పార్శాలు ఉంటాయి. నాకు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చిన సినిమా ‘అగధ’ ’ అని యువ హీరో శ్రవణ్‌రెడ్డి అన్నారు. దర్శకనిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో ఆయన నటించిన డివైన్ మిస్టిక్ థ్రిల్లర్ ‘అగధ’. కాశీవిశాలాక్షి బలుసు నిర్మించారు. ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. శనివారం హైదరాబాద్‌లో హీరో శ్రవణ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘ఈ కథలో నెగెటివ్ పాత్ర అనేది ఉండదు.
పరిస్థితుల వల్లే కొన్ని పాత్రలు నెగెటివ్‌గా అనిపిస్తుంటాయి. గుడ్ వర్సెస్ బ్యాడ్.. గాడ్ వర్సెస్ ఈవిల్ అన్నట్టు ఈ సినిమా సాగుతుంది. కథ చెప్పిన నాలుగోరోజే సెట్స్‌కి వెళ్లాను. ఎమ్మెస్రాజు చెప్పింది చెప్పినట్టు చేశాను. ‘డర్టీహరి’ నన్ను ఓటీటీ ప్రేక్షకులకు చేరువ చేసింది. ఈ సినిమాతో థియేట్రికల్‌గా కూడా మెప్పిస్తానని నమ్మకంతో ఉన్నా’ అని చెప్పారు శ్రవణ్‌రెడ్డి.
ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ నీట్‌గా, నేచురల్‌గా ఉంటాయని, మిస్టిక్ హారర్ ఫీల్‌ని తెచ్చేందుకు కొన్ని సెట్స్ వేయాల్సివచ్చిందని, ఈ కథకు సీక్వెల్ చేసే అవకాశం ఉందని శ్రవణ్‌రెడ్డి చెప్పారు. తదుపరి సినిమాల గురించి మాట్లాడుతూ ‘రాజ్ అండ్ డీకే టీంలోని పనిచేసిన చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. మరికొన్ని చిత్రాలు చర్చల్లో ఉన్నాయి. డిఫరెంట్ జోనర్ చిత్రాలతో మెప్పించాలనే నటుడిగా నా లక్ష్యం’ అని ఆయన అన్నారు.