‘ఇందులో నా పాత్ర పేరు మహాదేవి. దేవుని అనుగ్రహంతో పుట్టే పాత్ర అది. నా ప్రిన్సిపల్స్ పక్కన పెట్టి మహాదేవిగా మారడానికి చాలా కష్టపడ్డాను. బుద్ధిజం పుస్తకాల్ని చదివాను’ అన్నారు నటి కామాక్షి భాస్కర్ల.
‘డర్టీ హరి’ తర్వాత నేను చేసిన పూర్తి భిన్నమైన పాత్ర ఇది. ఈ పాత్రలో చాలా పార్శాలు ఉంటాయి. నాకు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చిన సినిమా ‘అగధ’ ’ అని యువ హీరో శ్రవణ్‌రెడ్డి అన్నారు.
కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భానుచందర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘అగధ’ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది.
దక్షిణాదిలో ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలుగొందారు మంజుల. ఎన్నో హిట్ చిత్రాల్లో భాగమయ్యారు. తాజాగా ఆమె మనవరాలు జోవికా విజయ్ కుమార్ ‘అగధ’ చిత్రం ద్వారా సినీరంగానికి పరిచయమవుతున్నది.
నిర్మాతగా భారీ విజయాల్ని సొంతం చేసుకున్న ఎం.ఎస్.రాజు.. దర్శకుడిగా కూడా రాణిస్తున్నారు. తాజాగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’.