రుద్రంపూర్, ఆగస్టు 01 : సింగరేణి కొత్తగూడెం ఏరియాకు నూతన జనరల్ మేనేజర్‌గా నియమితులైన సీహెచ్.వెంకట రమణ శనివారం జనరల్ మేనేజర్ ఏరియా కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్వో టు జీఎం గోవిందరావు ఆధ్వర్యంలో ఏరియా ఉన్నతాధికారులు కలిసి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజల అనంతరం సీహెచ్.వెంకట రమణ జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించి తన కార్యాలయంలోని స్థానంలో ఆసీనులయ్యారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజినీర్ వి. రామకృష్ణ, పర్సనల్ మేనేజర్ తిరుపతి, సీఎం ఓ ఏ ఐ ఏరియా జనరల్ సెక్రెటరీ ఉపేందర్, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష్, ఎస్టేట్ అధికారి తౌర్య, ఏరియా వర్క్ షాప్ డీజీఎం క్రిస్టఫర్, ఏరియా వర్క్ షాప్ ఇంజినీర్ శంకర్, ఐ ఈ డి డీజీఎం యోహాన్, ఇతర ఏరియా ఉన్నతాధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

కొత్తగూడెం ఏరియా నూతన జనరల్ మేనేజర్‌గా సీహెచ్.వెంకట రమణ బాధ్యతల స్వీకరణ