దక్షిణాదిలో ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలుగొందారు మంజుల. ఎన్నో హిట్ చిత్రాల్లో భాగమయ్యారు. తాజాగా ఆమె మనవరాలు జోవికా విజయ్ కుమార్ ‘అగధ’ చిత్రం ద్వారా సినీరంగానికి పరిచయమవుతున్నది. ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్.రాజు డివైన్ మిస్టిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాశీ విశాలాక్షి బలుసు నిర్మాత.
గురువారం జోవికా విజయ్ కుమార్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె హరిణి అనే పాత్రలో కనిపించనుంది. ఆధ్యాత్మిక, మార్మిక మూలాలు కలిగిన ఈ కథలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్నది.