Princess Isabella | పూర్తిగా సైన్యంలోకి రాకుమారి.. డెన్మార్క్ రాజ కుటుంబంలో సరికొత్త అధ్యాయం..!
Princess Isabella | డెన్మార్క్ రాజ కుటుంబం (Denmark Royal Family) లో ఒక సరికొత్త చారిత్రక అధ్యాయం మొదలైంది. ఆ దేశ రాజు ఫ్రెడెరిక్ ఎక్స్ (Frederic X), రాణి మేరీల కుమార్తె, 19 ఏళ్ల ప్రిన్సెస్ ఇసాబెల్లా (Princess Isabella) సైన్యంలో చేరారు. పూర్తిస్థాయి సైనిక సేవల్లోకి అడుగుపెట్టిన తొలి మహిళా రాజవంశీకురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు.
Princess Isabella : డెన్మార్క్ రాజ కుటుంబం (Denmark Royal Family) లో ఒక సరికొత్త చారిత్రక అధ్యాయం మొదలైంది. ఆ దేశ రాజు ఫ్రెడెరిక్ ఎక్స్ (Frederic X), రాణి మేరీల కుమార్తె, 19 ఏళ్ల ప్రిన్సెస్ ఇసాబెల్లా (Princess Isabella) సైన్యంలో చేరారు. పూర్తిస్థాయి సైనిక సేవల్లోకి అడుగుపెట్టిన తొలి మహిళా రాజవంశీకురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. డెన్మార్క్ ప్రభుత్వం (Denmark Govt) ఇటీవల ప్రవేశపెట్టిన 11 నెలల తప్పనిసరి సైనిక శిక్షణలో భాగంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
హైస్కూల్ విద్య పూర్తికాగానే, స్లాగెల్సేలోని ఆంట్వోర్స్కోవ్ బ్యారెక్స్‌లో ఉన్న ‘గార్డ్ హుస్సార్ రెజిమెంట్’లో ఆమె రిపోర్ట్ చేశారు. ఎలాంటి ప్రత్యేక హంగులు లేకుండా ఆమె సాధారణ సైనికురాలిగా విధుల్లో చేరడం విశేషం. ఈ శిక్షణ సమయంలో సాధారణ సైనికులకు ఇచ్చే జీతభత్యాలను తీసుకోకూడదని ప్రిన్సెస్ ఇసాబెల్లా నిర్ణయించుకున్నారు. తన తల్లిదండ్రుల ఆర్థిక అండతోనే ఉంటానని, ప్రభుత్వ వేతనం తనకు వద్దని స్పష్టం చేసినట్లు రాజకుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది.
ఆమె సోదరుడు, యువరాజు క్రిస్టియన్ కూడా గతంలో ఇదే రెజిమెంట్‌లో శిక్షణ పూర్తి చేసుకోవడం గమనార్హం. యూరప్, ఆర్కిటిక్ ప్రాంతాల్లో మారుతున్న భద్రతా పరిస్థితుల నేపథ్యంలో డెన్మార్క్ తన రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నది. ఇందులో భాగంగానే సైనిక సేవా కాలాన్ని 4 నెలల నుంచి 11 నెలలకు పెంచింది. అంతేకాకుండా తొలిసారిగా మహిళలకు కూడా తప్పనిసరి సైనిక సేవను వర్తింపజేసింది. ఈ కొత్త సంస్కరణల కింద శిక్షణ పొందుతున్న తొలి బ్యాచ్‌లోనే ప్రిన్సెస్ ఇసాబెల్లా చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

