న్యూఢిల్లీ: తన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్‌ను ఇండియాలో రిస్ట్రిక్ట్ చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆరోపించారు. దీనికి కారణాలు ఏంటో చెప్పాలని ఆయన మెటా సంస్థను డిమాండ్ చేశారు. తన ఎక్స్ అకౌంట్లో ఓ మెసేజ్ పోస్టు చేశారు. తన అకౌంట్‌ను రిస్ట్రిక్ట్ చేసిన విషయాన్ని మెటా ఇండియా ఆఫీసు తనకు తెలియజేసిందన్నారు. ఇండియాలో తన అకౌంట్ అందుబాటులో లేదన్నారు. తన అకౌంట్‌ను నియంత్రించడానికి గత కారణాలను కంపెనీ అధికారులు వెల్లడించలేదన్నారు. ఎలా ఆ రిస్ట్రిక్షన్ తొలగించాలన్న అంశాన్ని కూడా ఆ కంపెనీ చెప్పలేకపోయిందన్నారు.
ఈమెయిల్స్ రాసినా.. కేవలం అక్నాలెడ్జ్మెంట్ మాత్రమే ఇస్తున్నారన్నారు. అయితే కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై మెటా సంస్థ ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అకౌంట్ స్టేటస్‌కు చెందిన పేజీ స్క్రీన్‌షాట్‌ను కూడా తన మెసేజ్‌లో కేజ్రీవాల్ షేర్ చేశారు. కొన్ని లొకేషన్లలో అన్అవైలెబుల్ అని చూపిస్తున్నది. కంపెనీ నుంచి దీనిపై క్లారిటీ లేదన్నారు. ఎక్స్ సర్వీస్ చాలా చెత్తగా ఉందన్నారు. ప్రధాని మోదీ బెదిరింపులకు లొంగిపోవద్దు అన్నారు. లేదంటే ఇండియాలో కేవలం ఆయన ఒక్క అకౌంట్ మాత్రమే అందుబాటులో ఉండేలా చేస్తారని ఆరోపించారు.
Hi @Meta @metaindia
Why have you restricted my account? Verbal enquiries at your India office revealed that my account has been restricted in India and is unavailable in India. Why? Noone in your office is giving any reasons. Noone is suggesting how restrictions can be removed.… pic.twitter.com/4JThAqFMon
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 6, 2026