Traffic Rules | నందిపేట్ : ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి సూచించారు. నందిపేట్ మండల కేంద్రంలో సోమవారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా పాఠశాల విద్యార్థులతో ప్రధాన రోడ్డుపై ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ఆవరణలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఓవర్ స్పీడ్ తదితర నిబంధనలను పాటించాలని సీఐ సూచించారు. ఈ కార్యక్రమంలో ఉజ్వల స్కూల్ కరస్పాండెంట్ గోజూరి అరుణ్, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.