Kotagiri | కోటగిరి, జనవరి 8 : గ్రామాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని కోటగిరి ఎంపీడీవో విష్ణు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులకు ఎంపీడీవో కార్యాలయంలో గురువారం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త సర్పంచులకు శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో విష్ణు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా సర్పంచులు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆరులైన పేదలకు అందేలా సర్పంచులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీవో ముజఫర్ బేగ్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.