రా, ఆర్ఎస్ఎస్పై ఆంక్షలు విధించాలి.. యూఎస్‌సీఆర్‌ఎఫ్ సంచలన నివేదిక
మత స్వేచ్ఛ ఉల్లంఘనలలో పాత్ర పోషిస్తున్నందుకు భారతదేశ విదేశీ నిఘా వ్యవస్థ రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా), బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధించాలని అమెరికా ప్రభుత్వ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్(యూఎస్‌సీఆర్‌ఎఫ్) తన 2026 సంవత్సరం వార్షిక నివేదికలో సిఫార్సు చేసింది.
న్యూఢిల్లీ, మార్చి 16 : మత స్వేచ్ఛ ఉల్లంఘనలలో పాత్ర పోషిస్తున్నందుకు భారతదేశ విదేశీ నిఘా వ్యవస్థ రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా), బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధించాలని అమెరికా ప్రభుత్వ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్(యూఎస్‌సీఆర్‌ఎఫ్) తన 2026 సంవత్సరం వార్షిక నివేదికలో సిఫార్సు చేసింది. భారతదేశంలో మతస్వేచ్ఛకు జరుగుతున్న ఉల్లంఘనలపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ కమిషన్ నివేదిక ఇవ్వడం వరుసగా ఇది ఏడవసారి. అయితే భారత్‌ను మతస్వేచ్ఛ ఉల్లంఘనలు జరుగుతున్న దేశంగా ప్రకటించాలన్న కమిషన్ సిఫార్సును అమెరికా విదేశాంగ శాఖ ఇప్పటివరకు ఏ సంవత్సరమూ పరిగణనలోకి తీసుకోలేదు.
మత స్వేచ్ఛ విషయంలో తీవ్రమైన ఉల్లంఘనలకు బాధ్యత రా; ఆర్ఎస్ఎస్దేనని, ఉల్లంఘనల పట్ల సహనంతో వ్యవహరించినందుకు వీటిపై ఆంక్షలు విధించాలని కమిషన్ మార్చి 4న విడుదల చేసిన తన నివేదికలో అమెరికన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కాగా, 2023లో న్యూయార్క్‌లో ఓ అమెరికా జాతీయుడిపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి రాపైన, దాని అప్పటి అధికారి వికాశ్ యాదవ్‌పైన ఆంక్షలు విధించాలని తన 2025 సంవత్సరం వార్షిక నివేదికలో కమిషన్ సిఫార్సు చేసింది. భవిష్యత్తులో భద్రతా సహాయం, ద్వైపాక్షిక వాణిజ్య విధానాలను భారత్‌లో మత స్వేచ్ఛ మెరుగుదలతో అనుసంధానించాలని ట్రంప్ ప్రభుత్వాన్ని కమిషన్ కోరింది. అమెరికా పౌరుల పైన, మతపరమైన మైనారిటీలపైన బెదిరింపులు, వేధింపులు కొనసాగుతున్నాయని పేర్కొన్న కమిషన్ భారత్‌కు ఆయుధాల అమ్మకాలను నిలిపివేసేందుకు ఆయుధ ఎగుమతి నియంత్రణ చట్టంలోని సెక్షన్ 6ని అమలు చేయాలని అమెరికన్ కాంగ్రెస్‌ను కోరింది.
ఆర్ఎస్ఎస్ని నిషేధించాలి : కాంగ్రెస్
భారత ప్రజల మత స్వేచ్ఛకు ఆర్ఎస్ఎస్ ముప్పుగా పరిణమించిందని అమెరికా ప్రభుత్వానికి చెందిన అధికారిక కమిషన్ హెచ్చరించిందని కాంగ్రెస్ సోమవారం ఎక్స్‌లో పేర్కొన్నది. మహాత్మా గాంధీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్పై సర్దార్ పటేల్ నిషేధం విధించడాన్ని కాంగ్రెస్ గుర్తు చేసింది. రాజ్యాంగాన్ని వ్యతిరేకించే ఆర్ఎస్ఎస్ మనుస్మృతి ప్రకారం దేశం నడవాలని చెబుతుందని కాంగ్రెస్ పేర్కొన్నది. ఆర్ఎస్ఎస్ ఈ దేశ సమైక్యతకు, సోదరభావానికి విషంగా కాగ్రెస్ ఆరోపించింది.
అవాస్తవాల నివేదిక : కేంద్రం
ఆర్ఎస్ఎస్, ‘రా’పై ఆంక్షలు విధించాలని సిఫార్సు చేస్తూ అమెరికా కమిషన్ ఇచ్చిన తాజా వార్షిక నివేదికను విదేశీ వ్యవహారాల శాఖ సోమవారం తోసిపుచ్చింది. నిష్పాక్షిక వాస్తవాల కంటే భారత్‌పై అవాస్తవ వక్రీకరణలతో కూడిన కథనాన్ని కమిషన్ తన నివేదికలో చిత్రీకరించిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైస్వాల్ సోమవారం ఓ ప్రకటనలో విమర్శించారు. నివేదికను నిర్దంద్వంగా తిరస్కరిస్తున్నామని ఆయన తెలిపారు. గడచిన అనేక సంవత్సరాలుగా కమిషన్ భారత్‌పై వక్రీకరణలతో కూడిన నివేదికలను అందచేస్తున్నదని, కమిషన్ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తాయని జైస్వాల్ పేర్కొన్నారు. అమెరికాలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను, అమెరికాలోని భారతీయ సంతతిపై పెరుగుతున్న వేధింపులు, అసహనంపై కమిషన్ దృష్టి సారించాలని ఆయన సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Ban RSS
- National news
- RAW
- RSS
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

