Pothangal | పోతంగల్, జనవరి 8 : ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడటం ఉత్తమమని కోటగిరి ఎస్సై సునీల్ వాహనదారులకు సూచించారు. పోతంగల్ మండల కేంద్రంలో ఎస్సై, పోలీస్ సిబ్బంది, స్థానికులతో కలసి గురువారం హెల్మెట్ ధరించి అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోతంగల్ మండల కేంద్రంలోని బస్టాండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ తిరుమలపూర్ క్రాసింగ్ వరకు సాగింది.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడితే ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడోచ్చని తెలిపారు. ప్రత్యేకించి యువత అతివేగంతో పాటు ఫోన్లలో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశముందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ బన్సీలాల్, పోలీస్ సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.