Balakrishna Reddy | నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణా రెడ్డితో ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల అధినేత మారయ్య గౌడ్ భేటీ బుధవారం అయ్యారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన బాలకృష్ణారెడ్డి తో పలు కీలక అంశాలపై చర్చించారు. ఉన్నత విద్యలో తీసుకు రావాల్సిన సమూల మార్పులు, చేర్పులు యువతకు ఉపాధి మార్గాలు సులువుగా దక్కే విధంగా విద్యాబోధన ఏ విధంగా చేపట్టాలనే అంశాలపై చర్చించారు.
సాంకేతిక విద్యను కింది స్థాయి వరకు తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన ప్రణాళిక పైన ఉన్నత విద్యా మండలి చైర్మన్ తో మారయ్య గౌడ్ కులంకషంగా వివరించారు. గ్రామీణ పేద విద్యార్థులకు చదువుతోపాటు ఉపాధి దక్కించుకునేందుకు నైపుణ్యతను దక్కించుకునే విధంగా విద్యా ప్రణాళిక ఉండాలని మారయ్య గౌడ్ అభిప్రాయ పడ్డారు.