Nandipet | నందిపేట్ : నందిపేట మండలం సర్పంచుల ఫోరం కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని సర్పంచులంతా ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి ఆయా అంశాలపై చర్చించారు. అనంతరం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
అధ్యక్షులుగా నందిపేట సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం, ఉపాధ్యక్షులుగా ఐలాపూర్ సర్పంచ్ మీసాల లక్ష్మీనారాయణ, మాయాపూర్ సర్పంచ్ బ్యాగరి జీవన్, కార్యదర్శిగా కుధ్వాన్పూర్ సర్పంచ్ మంగళారం సునీత, సంయుక్త కార్యదర్శిగా బజారు కొత్తూరు సర్పంచ్ గోపు ముత్యం, కోశాధికారిగా ఆంధ్ర నగర్ సర్పంచ్ సుష్మ రామకృష్ణ, అధికార ప్రతినిధిగా వెల్మల్ సర్పంచ్ దేవేందర్, సలహాదారుడిగా లక్కంపల్లి సర్పంచ్ సంతోష్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సర్పంచులు ఘనంగా సన్మానించారు. సర్పంచుల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందించి పరిష్కారం పట్ల కృషి చేస్తామని నూతన కార్యవర్గం ఈ సందర్భంగా పేర్కొంది.