Nandipet | నందిపేట్ : నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(సొసైటీ) ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం గ్రామ అఖిలపక్షం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పలువురు కామారెడ్డి కలెక్టర్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం ఐలాపూర్ సొసైటీ పరిధిలో తమ గ్రామం ఉందని, ఐలాపూర్ నుండి వేరు చేసి ప్రత్యేకంగా తమ గ్రామంలో సొసైటీ ఏర్పాటు చేయాలని, వెల్మల్ కు ఆంధ్ర నగర్, కౌల్ పూర్, రైతు ఫారం, జోజిపేట్ గ్రామాలు సమీపంగా ఉన్నాయని తెలిపారు.
కావున ఈ గ్రామాల రైతుల సౌకర్యార్థం తమ గ్రామంలో సొసైటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేవేందర్, ఉపసర్పంచ్ మహేష్, మాజీ సర్పంచ్ పెద్ద గంగారం, నాయకులు రామకృష్ణ, రాము, గోజూరి నరేందర్, కిషన్, మహేష్, శ్రీధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.