సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కార్మేని సెల్వం’. రామ్చక్రి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అరుణ్ రంగరాజులు నిర్మాత. ఏప్రిల్ 3న తమిళ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. పీవీఆర్ ఐకాన్స్ పిక్చర్స్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్గా ఉంది.
సెల్వం అనే సాధారణ కారు డ్రైవర్ జీవితం చుట్టూ తిరిగే కథ ఇదని, ఆధునిక సమాజంలో ఎదురయ్యే ఒత్తిళ్ల మధ్య అతని ప్రయాణం ఎలా సాగిందన్నది భావోద్వేగభరితంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. నిజాయతీపరుడైన ఓ సామాన్యుడి కథగా మెప్పిస్తుందని దర్శకుడు పేర్కొన్నారు. లక్ష్మీప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోదండం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ, కథ, దర్శకత్వం: రామ్ చక్రి.