Kamareddy | కామారెడ్డి రూరల్, డిసెంబర్ 5 : కామారెడ్డి జిల్లా కేంద్రంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కోల బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ఉపాధ్యక్షులు ఉస్సేన్, రాజానర్సు, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయిరాం, శివరాజు, రాజేందర్, కుర్మ వెంకట్, హమీద్, నాయిముద్దీన్, జిల్లా మహిళా అధ్యక్షుడు హాఫిజ్, ఉపాధ్యక్షురాలు రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.