ముంబై, మార్చి 6: డిజిటల్ బ్యాంకింగ్ మోసాల్లో కస్టమర్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం గట్టి రక్షణాత్మక చర్యలను ప్రతిపాదించింది. మోసపూరిత ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి ముసాయిదా సవరణ సూచనలను జారీ చేసింది.
వచ్చే నెల ఏప్రిల్ 6లోగా వీటిపై అభిప్రాయాలను తెలియపర్చాలని కూడా బ్యాంకులు, ఖాతాదారులను కోరింది. ఇక చిన్నచిన్న మోసపూరిత లావాదేవీల్లో బాధితులకు నష్టపరిహారానికి సంబంధించి కూడా పలు ప్రతిపాదనలను చేసింది.