దేశాన్ని ప్రేమించడం ఒక గొప్ప విషయం. గురజాడ చెప్పారు కదా ‘దేశమును ప్రేమించుమన్నా’ అని. మన మహాత్మునికి ఇష్టమైన ‘రఘుపతి రాఘవ రాజారామ్.. సబ్ కో సన్మతి దే భగవాన్' అర్థం కూడా ప్రేమయే కదా?
సప్తఋషి పేరుతో (1) సమ్మిళిత అభివృద్ధి (2) చిట్టచివరి వ్యక్తుల వరకు ఫలాలు అందడం (3) మౌలిక వసతుల కల్పన (4) పెట్టుబడులకు ప్రోత్సాహం (5) సంభావ్యతలు (6) హరిత వృద్ధి (7) యువతకు చేయూతలను ప్రాధాన్యత అంశాలుగా పేర్కొన్నారు.
సమస్యను మూలాల నుంచి అర్థం చేసుకోవటం, అక్కడి నుంచే పరిష్కారాన్ని ప్రారంభించటం ముఖ్యమంత్రి కేసీఆర్ పద్ధతి. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన ‘మన ఊరు- మన బడి’ని ఈ విధంగానే అర్థం చేసుకోవాలి.
‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని పాత మాటల్లో చెప్పినా, ‘మీ శరీరం పట్ల శ్రద్ధ వహించండి. ఎందుకంటే, మీరు నివసించే ఏకైక ప్రదేశం అదే’ అని కొత్త పదాల్లో చెప్పినా సారాంశం ఒక్కటే.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని.
రైతుల ఆదాయంపై పన్ను విధించాలనే ప్రతిపాదనను ముందుకు తేవడంలో మోదీ ప్రభుత్వ రైతు వ్యతిరేకత మరోసారి వెల్లడైంది. సాక్షాత్తూ ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ చేత రైతులపై పన్ను భారం వేయాలంటూ పలికించడం మోదీ �
ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ ఆస్తుల మార్పిడి ఈ కరెన్సీ మాధ్యమంగా జరుగుతుంది. క్రిప్టోకరెన్సీలు నెట్ వర్క్‌లలో పీర్-టు-పీర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాయి.