Municipal Elections | ఎల్లారెడ్డిలో ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
Municipal Elections | కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ ఎల్లారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆందోళన చేపట్టారు.
Municipal Elections | కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ ఎల్లారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు
ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని జాజాల సురేందర్ ఆరోపించారు. డీఎస్పీ, సీఐ, ఎస్సై మూకుమ్మడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు మద్దతు తెలుపుతున్నారని, ఎన్నికల ప్రక్రియను అపహస్యం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, బీఆర్ఎస్ నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న జాజాల సురేందర్, ఇతర బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి ఇతర ప్రాంతాలకు తరలించారు.

Yellareddy2
Read Today's Latest Nizamabad Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

