అంతా అంకెల గారడి
తప్పడు లెక్కల పేరడీ
ఓటు రాబడుల ఒరవడి
ఇదే తాజా బడ్జెట్ సూత్రం
కేంద్ర సర్కార్ నయా మంత్రం
విత్త మంత్రి ఆర్థిక పొత్రంలో
జన సంక్షేమం, రాయితీలకు
అడ్డు కోతలు నిలువు గాట్లు
విద్య, వైద్యం సేద్యంతో పాటు
అన్నింటినీ ప్రయివేటికరించే
కుహనా కుట్రల రచన తప్పా
దేశ ప్రగతి ప్రణాళిక మృగ్యం
బ్యూరోక్రాట్లకు పెద్దపీటలు
కార్పొరేట్లకు ఎర్ర తివాచీలు
గరీభీకి మాత్రం రిక్తహస్తాలు
నయా బడ్జెట్ నివేదికలో
ఉపాధి హామీ ఊసు లేదు
మహిళా భద్రత జాడ లేదు
నిరుద్యోగులకు ఊరట లేదు
అన్నదాతలకు బాసట లేదు
సామాన్యులకు ఆసరా లేదు
అన్నింటా తూతూ మంత్రాలే
ఏతా వాత తేలిందేమంటే
నిర్మలా సీతారామన్ బడ్జెట్
పాలకుల ఎజెండాకు పాంప్లేట్
కార్పొరేట్ శక్తులకు రెడ్ కార్పెట్
సామాన్యులకు షాక్ ట్రీట్మెంట్
యావద్దేశానికి డిసప్పాయింట్మెంట్
కోడిగూటి తిరుపతి: 95739 29493