మంచిర్యాల : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యాలకు దిగుతోంది. మంచిర్యాల జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రతిపక్ష బీఆర్ఎస్ ఏజెంట్లను లక్ష్యంగా చేసుకుని పోలీసులతో దౌర్జన్యం చేయిస్తోంది. బీఆర్ఎస్ ఏజెంట్లను పోలింగ్ బూత్‌ల లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటోంది.
లక్సేట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 9వ, 10వ పోలింగ్ కేంద్రాల దగ్గర బీఆర్ఎస్ ఏజెంట్‌గా ఉన్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్‌ను పోలింగ్ బూత్ లోపలికి వెళ్లకుం పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించడంతో పోలింగ్ కేంద్రం ఆవరణ నుంచి పక్కకు ఈడ్చుకెళ్లారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆయన పోలింగ్ కేంద్రం ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు.
మంచిర్యాల జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం
బీఆర్ఎస్ ఏజెంట్ లను పోలింగ్ బూత్ లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకొని నెట్టేస్తున్న పోలీసులు
లక్సేట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 9, 10 పోలింగ్ కేంద్రాల వద్ద బీఆర్ఎస్ ఏజెంట్‌గా ఉన్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్… pic.twitter.com/OSCh5blWLK
— BRS News (@BRSParty_News) February 11, 2026