ఒకానొక కాలపు రుతువుచెట్టు నీడలో
చిటికెన వేలుకు అంటిన తడి స్నేహం తను ఆటలో కరిగిపోయిన క్షణాల రుచి
మనసుకు అద్దిన మమకారుడు
నా బాల్యం సంచిలో ఒదిగిన రెండో పావురం పాటల పతంగి.
అవును. ‘ఆమె’విజ్ఞురాలు. నేనేదో తాత్వికంగానో, కాల్పనికంగానో ఈ మాటలు చెప్పడం లేదు సుమా.. మరణం వచ్చి తలుపు తడుతుందని కచ్చితంగా తెలిశాక కూడా ఎంతమంది ధైర్యంగా ఉంటారు?