బతుకును ఇచ్చే బలం తంగేడు వనం..
మనసంతా శమీ పరిమళం..
పచ్చని తోరణాలు.. నిండా పూల వనాలు..
ఇదీ నా తెలంగాణ అంగణం..
నా తెలంగాణ భాష, వాగామృత భూష!
అన్న పదం.. అన్నం పదం..
ప్రాచీనం.. ప్రాచిత్వం..
నాడు నా తెలంగాణం.. ప్రతినాయక పాత్రలకు
హేళన చేస్తూ ధరింపజేసిన భాష, గోస!
నాటి వేదన ఘోష.. అవమానం..
నేడు ప్రతి పాత్ర వేదఘోష.. సన్మానం..
మాతృభాషకు పట్టాభిషేకం..
అదే ఆత్మగౌరవానికి కిరీటం..
నా భాష ఆత్మీయ బల హస్తం..
విలువల ‘బలగం’..
ప్రతి పాటలో మాటలో..
మందార మకరందాల ధార..
వంచన చేస్తే.. సూర్యుడు మెడలు వంచే..
ఎరుపు డాలు, చక్రమూ అవుతాడు..
కిరణాలన్నీ బాణాలవుతయ్..
నా భాష స్వరిత శ్వాసయోగం..
నా శ్వాసలో హరిత గోదావరి నాదం..
ప్రతి పలుకులో వాసర పలుకుల వెలది..
వెలసి ఉంది.. తెలుసా..
నా భాష వేద ఘోష..
వేదజ్ఞ రాణి శ్వాస..
డాక్టర్ పింగళి గంగాధర్ రావు: 90141 01975